AP Congress| ఏపీలో బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన అధిష్టానం.. తాజాగా మరికొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది.
- Advertisement -
రెండో విడతలో భాగంగా 35 నియోజకవర్గాలకు సమన్వయకర్తల పేర్లను ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు.