CREDAI Property Show in Vizag: గృహ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పోకు విశాఖ వేదిక కానుంది. డిసెంబర్ 19 నుంచి విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో 11వ ‘క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2025’ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఒక హోటల్‌లో బుధవారం ముందస్తు ప్రణాళికా కార్యక్రమాన్ని క్రెడాయ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ హాజరయ్యారు. క్రెడాయ్ ఎక్స్‌పో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ డీజీఎం (బిజినెస్, ఆపరేషన్స్) రాహుల్ సాంక్రిత్య మాట్లాడుతూ.. గృహ వినియోగదారులకు కావాల్సిన అన్ని సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రెడాయ్ విశాఖ చాప్టర్ ఛైర్మన్ వి.ధర్మేందర్ మాట్లాడుతూ.. ఈసారి విశాఖలో జరగనున్న క్రెడాయ్ ఎక్స్‌పోకు భారీ స్థాయిలో గృహ వినియోగదారులు హాజరుకానున్నట్లు తెలిపారు. మరోవైపు, క్రెడాయ్ అధ్యక్షులు ఈ.అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రాపర్టీ షోకి రియల్టర్స్, బిల్డర్స్, ఇన్వెస్టర్స్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. క్రెడాయ్ కార్యదర్శి వి. శ్రీను మాట్లాడుతూ.. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య వారధిలా ఈ ఎక్స్‌పో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్ పో కన్వీనర్ సీహెచ్ గోవిందరాజు మాట్లాడుతూ.. క్రెడాయ్ ఎక్స్‌పోలో 70 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్‌పోలో రెసిడెన్సియల్, కమర్షియల్ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేశారు. క్రెడాయ్ నేషనల్ ఎమర్జింగ్ సిటీస్ కన్వీనర్ రాజా శ్రీనివాస్, క్రెడాయ్ ఏపీ అధ్యక్షులు బి.శ్రీనివాసరావుతో పాటు గత అధ్యక్షులు, స్పాన్సర్లు, ఎగ్జిబిటర్లు, సంఘం సహచర బిల్డర్లు ఈ కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
CREDAI Property Show: క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో సక్సెస్ కావాలి.. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆకాంక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


