HomeTop StoriesBetting: అనంతపురంలో క్రికెట్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Betting: అనంతపురంలో క్రికెట్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Betting Gang Arrested: అనంతపురం జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తంగా పది మందిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ జగదీష్‌ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/famous-producer-rb-choudhary-passes-away-in-road-accident/

ఫిలిప్పీన్స్ కేంద్రంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు మంగళవారం ఛేదించారు. 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులు ‘డ్రీమ్ ప్లే’ అనే యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ ముఠాకు ఫిలిప్పీన్స్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

Also Read: https://teluguprabha.net/national-news/tvk-chief-vijay-says-that-collective-cooperation-for-the-tamil-nadu-development/

నిందితుల నుంచి సుమారు రూ. 19.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 9 బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 18.20 లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఒక కారు, 4 బైకులు, 3 ల్యాప్‌టాప్‌లను సీజ్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి దాదాపు 70 మంది స్థానిక వ్యక్తుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటి ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ముఠాకు సూత్రధారిగా భావిస్తున్న శివ, సచిన్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో బీఎన్‌ఎస్‌, ఐటీ యాక్ట్, ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News