Homeఆంధ్రప్రదేశ్Veldurthi: పంటలు ఎండిపోయె.. పనులు కరువాయె

Veldurthi: పంటలు ఎండిపోయె.. పనులు కరువాయె

వెల్దుర్తి(తెలుగు ప్రభ): ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో రైతులు వాటిని తొలగించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మళ్లీ ఆశలు చిగురించడంతో అప్పులు చేసి పెట్టుబడులు సమకూర్చుకుని రెండోసారి పొలాల్లో విత్తనాలు వేశారు. అయితే విత్తనాలు మొలకెత్తిన నాటి నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో మొలకలు వాడిపోతున్నాయి. దీంతో రైతులకు మరోసారి నష్టం తప్పడం లేదు.

- Advertisement -

ఎండైనా నష్టమే.. వానైనా నష్టమే..
ఒకవైపు వర్షాలు లేక పంటలు దెబ్బతినగా.. మరోవైపు విత్తిన పంటలకు సరైన వర్షం లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిగులు చెందుతున్నారు. పంట పనులు లేక రైతు కూలీలకు కూడా ఉపాధి కరువైంది. పనుల కోసం పలువురు కూలీలు వలస బాట పడుతున్నారు. వెల్దుర్తి రైల్వే స్టేషన్‌ నుంచి గుంటూరుకు, వాహనాల ద్వారా హైదరాబాద్‌, బెంగళూరు వంటి పట్టణాలకు ఉపాధి కోసం వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. కరువు పరిస్థితుల్లో రైతులు, కూలీలను ప్రభుత్వం ఆదుకుని ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News