Thursday, October 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala| రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామి వారి దర్శనం కోసం 8 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం తీసుకుంటుంది. శ్రీవారి దర్శనం కోసం వైంకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తుఫాన్ ఎఫెక్ట్‌తో 200కు పైగా రైళ్లు రద్దు అవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి ప్రధాన కారణమని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి మాత్రమే స్వామి వారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే బుధవారం కూడా శ్రీవారిని మోస్తరుగానే భక్తులు దర్శించుకున్నారు. 64,447 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,555 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. ఇక హుండీ ద్వారా రూ.3.38కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడదించారు. కాగా ఇటీవల శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన భక్తులను అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో కొండపైకి కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News