Tirumala Devotees Rush: వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే శ్రీవారిని 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,705 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, గురువారం స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు సమకూరిందని టీటీడీ వివరించింది.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/bomb-threat-mail-to-shamshabad-airport/
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, దర్శనానికి వెళ్లేవారు తగిన ప్రణాళికతో రావాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లలో మంచినీరు, పాలు, అన్నప్రసాదం సరఫరాను టీటీడీ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

