Crystal Quartz Seized Palnadu District: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన రంగురాళ్లను అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాచేపల్లిలోని ఒక గోడౌన్‌పై అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో వీటిని గుర్తించారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన క్రిస్టల్ క్వార్ట్జ్ రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ రంగురాళ్లను దాచేపల్లి మండలం శంకరాపురం సమీపంలోని కొండల నుంచి అక్రమంగా వెలికితీసినట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై అటవీ, విజిలెన్స్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

