MLA Sudhakar’s wife Digital Arrest: సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. సైబర్ వలకు ఎవరూ అతీతం కాదు అన్నట్లుగా.. సామాన్యుల నుంచి మొదలుకుని సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, డబ్బున్న వృద్ధుల వరకూ ఇందులో చిక్కుకుంటున్నారు. సర్వం కోల్వోయాక కానీ.. తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు సైతం సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఓ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తి.. రూ. 1.70 కోట్లు పోగొట్టుకున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cabinet-decision-on-local-body-elections/
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యను సైబర్ నేరస్థులు టార్గెట్ చేశారు. ఆమెకు ఒక రోజు గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక వాట్సాప్ వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు. అవతలి వ్యక్తులు తమను తాము సీబీఐ, బ్యాంక్, పోలీసు ఆఫీసర్లుగా పరిచయం చేసుకుని.. అనంతరం ఆమె పేరు మీద భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందని భయాందోళనకు గురిచేశారు.
మనీలాండరింగ్ కేసులో చిక్కుకుంటే జైలుకెళ్లడం ఖాయమని సైబర్ నేరగాళ్లు ఆమెను బెదిరించారు. ప్రస్తుతం ఆ కేసుపైన విచారణ జరుగుతోందని నమ్మబలికారు. విచారణ పూర్తయ్యేంతవరకు వీడియో కాల్‌లోనే ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఆమెను భయపెట్టి దాదాపు రూ.1.70 కోట్లు బదిలీ చేయించుకున్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/china-hits-third-1000-tonne-gold-belt/
అనంతరం ఏమీ చెప్పకుండా ఫోన్ కట్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే ఈ విషయాన్ని తన భర్త, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు తెలియజేసింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

