నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను
రేపు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్
ఎల్లుండి మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్
దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కూడ కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,
కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు
రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు
బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం
రేపు ఉదయం తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు.
రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ నిరంతరం తుఫాను గమనం పర్యవేక్షణ
విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సూచనలు
విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా యంత్రాంగం
ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలకోసం 4ఎన్డీఆర్ఎఫ్ , 6ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
క్షేత్రస్థాయిలో ప్రజలకు తుఫాన్ హెచ్చరిక మేసేజ్లు
ప్రజలు అత్యవసర సహయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి