Thursday, December 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Cyclone: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

మళ్లీ వానలు

నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుంది. దాదాపు వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటలు నాటికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణకోస్తా తీరం వైపు చేరే ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది.

- Advertisement -

డిసెంబర్20, శుక్రవారం :
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News