ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో మిచాంగ్ తుపాన్ కారణముగా ఈదురు గాలులతో రోడ్ ప్రక్కన ఉన్న చెట్లు కూలి పడిపోయాయి. దీంతో ప్రధాన రోడ్డు నుంచి రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. విషయం గమనించిన నిడమర్రు సీఐ ఎం.సుభాష్ అధ్వర్యంలో చేబ్రోలు ఎస్ఐ స్వామి తన సిబ్బంది సాయంతో హైవేపై పడ్డ చెట్లను తొలగించారు. దీంతో అప్పటి వరకు పేరుకుపోయిన 2 కిలోమీటర్ల ట్రాఫిక్ ఎట్టకేలకు కదిలింది. ట్రాఫిక్ క్లియర్ చేసిన అధికారికి అందరూ అభినందనలు తెలిపారు.

రహదారి ప్రమాదాలు నివారణ కొరకు జోరు వానలో కూడా చేబ్రోలు జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తున్న చేబ్రోలు పోలీస్ సిబ్బంది, తను జోరు వానలో తడిచిన వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందించిన ప్రజలు.