Tirumala| ఆంధ్ర, తమిళనాడుకు తుఫాను(Cyclone) హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో తిరుమలతో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తక్కువ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 2 గంటలు, రూ.300 దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం శ్రీవారిని 65,525మంది భక్తులు దర్శించుకోగా.. 19,880 మంది భక్తులు తలనీనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది.