Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone in Andaman: అండమాన్ లో అల్పపీడనం, మళ్లీ వర్షాలు

Cyclone in Andaman: అండమాన్ లో అల్పపీడనం, మళ్లీ వర్షాలు

ఉత్తరాంధ్రకు భారీ వాన..

ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికి(22 అక్టోబర్) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి,అక్టోబర్ 23 నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆతర్వాత తుపాను వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది.

- Advertisement -

భారీవర్ష సూచన

అక్టోబరు 24 మరియు 25న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈదురు గాలులు
అక్టోబరు 23 మరియు 24న పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 45 నుండి 65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

మత్స్యకారులకు హెచ్చరిక
సముద్రం అలజడిగా ఉంటుంది. అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News