Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone: తుపాను బాధితులకు ఎలాంటి ఇబ్బంది ఉండరాదు

Cyclone: తుపాను బాధితులకు ఎలాంటి ఇబ్బంది ఉండరాదు

సహాయ పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు

మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ శ్రీ లక్ష్మిశా మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కలెక్టర్ వారి చాంబర్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో సమావేశమయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలు ప్రత్యేక అధికారికి వివరించారు. జిల్లాలో తుఫాను ప్రభావిత తీర ప్రాంత 7 మండలాల పరిధిలో 67 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు సహాయ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, మంచి వసతి తోపాటు బాధితులకు టాయిలెట్ వంటి కనీససౌకర్యంలు కల్పిస్తున్నట్లు ప్రత్యేక అధికారికి వివరించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి లక్ష్మి శా మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అన్నారు ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

నెల్లూరు నగరంలో తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటిస్తున్న స్పెషల్ ఆఫసర్ హరి కిరణ్, కలెక్టర్ ఎం హరి నారాయణన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News