విశాఖపట్నం(Vizag) మహానగర పాలక సంస్థ(GVMC) డిప్యూటీ మేయర్ అభ్యర్థిని కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్‌ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నియమించారు. ఈమేరకు సీల్డ్ కవర్‌లో గోవింద్ పేరును జనసేన అధిష్ఠానం పంపింది. కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవి కోల్పోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉంటే ఇటీవల జీవీఎఎంసీ మేయర్ పీఠాన్ని కూడా కూటమి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మేయర్‌గా టీడీపీ నేత పీలా గోవింద్ ఎన్నికయ్యారు.
GVMC: విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES