ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఏటికొప్పాక బొమ్మల విశిష్టత దేశవ్యాప్తంగా మరోమారు వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటమైన ఏటికొప్పాక బొమ్మలతో మరోమారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అనకాపల్లి జిల్లా పేరు మారుమోగుతోంది. శకటం బాగుందంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు.
