Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్PM Modi Birthday : ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

PM Modi Birthday : ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

PM Modi Birthday wishes: సామాన్య జీవితం నుంచి అచంచలమైన క్రమశిక్షణ, అపారమైన నిబద్ధతతో భారతదేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోతో పాటు ప్రత్యేక పోస్ట్ చేశారు.

- Advertisement -

‘‘ప్రధాని మోదీ కేవలం పాలనకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యతను పెంపొందించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . ప్రతి పౌరుడు మన సంస్కృతి, గొప్ప వారసత్వం పట్ల గర్వపడేలా చేశారు.’’ అని ప్రశంసించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేయడానికి మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ గారి జీవితం ఒక స్ఫూర్తిదాయకమని, ఆయన దృఢ సంకల్పం, సమగ్రత, ఆధ్యాత్మిక బలం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

మరోవైపు, ఈ రోజు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మోదీ జన్మదినాన్ని బీజేపీ కార్యకర్తలు ‘సేవా దివస్’గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ కూడా ఒక వీడియోను షేర్ చేసి, మోదీతో తనకున్న అనుబంధాన్ని, ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో దేశాన్ని నిరంతరం నడిపేందుకు ఆయనకు మరింత శక్తి ఉండాలని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ – 2047’ అనే మీ పిలుపు ప్రతి భారతీయుడినీ దేశ నిర్మాణంలో భాగం కావాలని కోరుతోందన్నారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad