Sunday, February 8, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

CM Chandrababu: కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం 12.05 గంటలకు దూబగుంట శివారులో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 12.20 గంటలకు గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు.

- Advertisement -

మధ్యాహ్నం 1.30 గంటలకు కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News