గ్రామాల్లో ఇంటి వద్దకే ఉచిత వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను మంత్రి గుమ్మనూరు ప్రారంభించారు. పి కోటకొండ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభించి మంత్రి గుమ్మనూరు..
వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో మీ ఊరిలోనే మీ ఇంటి వద్దకే ఉచిత వైద్యం అందించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో ధనికులకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టే పేదలకు కూడా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి డాక్టర్ ను కేటాయించిందని గుమ్మనూరు వివరించారు. నూతన 104 నూతన వాహనాన్ని రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అంబులెన్స్ వాహనంలోని వసతులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ రామగిడ్డయ్య, మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు,ఆర్డీఓ మోహన్ దాస్, దిశ డిఎస్పీ వెంకట్రామయ్య, సి.ఐ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ బి. తిమ్మక్క, ఎంపీటీసీ-1వెంకటలక్ష్మి, తహసీల్దార్ సుదర్శన్, ఎంపీడీఓ గౌరిదేవి, ఈఓపిఆర్డీ సూర్యనారాయణ, వైద్యులు డా.విజయ్ భాస్కర్, రేష్మ,సి.హెచ్ఓ భాగ్యలక్ష్మి, జడ్పీటిసి కిట్టు, ఎంపీపీ భర్తలు ముంబా, మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, వైస్సార్సీపీ నాయకులు ప్రేమనాధ్ రెడ్డి, కప్పట్రాళ్ల దివాకర్ నాయుడు, హనుమంత రెడ్డి, కృష్ణ, లక్ష్మణ్ స్వామి, రంగస్వామి, సర్పంచ్ అరుణ్ కుమార్, రామచంద్ర, మదన్ మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, రాజన్న, రాఘవేంద్ర, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.