దేవనకొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పాదయాత్ర ప్రారంభించి ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజాసేవకు అంకితం అవుతానని పాటిల్ హిమవర్షారెడ్డి పేర్కొన్నారు. ఆమె తెర్నేకల్ లోని స్వగృహంలో అభిమానులు, మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం భర్త చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా అమ్మ నాన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలసి వైసీపీలో చేరానని, వచ్చే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పాటిల్ హిమవర్ష రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మా అమ్మ ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిందన్నారు. అభిమానుల, మద్దతుదారులతో చర్చించి ప్రణాళిక బద్ధంగా రాజకీయాల్లో ముందుకు వెళ్లి త్వరలో పాదయాత్ర లు సైతం నియోజకవర్గంలో చేపడతామన్నారు. ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజల బాగోగులను చూడడానికి తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని వెల్లడించారు. వైసీపీ నుండి ఆలూరు టికెట్టు రాకపోతే పత్తికొండ నుండి పోటీ చేస్తానని అవసరమైతే ఇండిపెండెంట్ గా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ షేక్ నజీర్, తెర్నేకల్ సర్పంచ్ అరుణ్ కుమార్, ఆలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి అభిమానులు, మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Devanakonda: ప్రజాసేవకు అంకితమవుతా: హిమవర్షారెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES