Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: గత నెల రోజులుగా తిరుమలకు పోటెత్తిన భక్తులు కాస్త తగ్గుముఖం పట్టారు. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మరో 10 కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

దర్శన సమయాల వివరాలు: శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి దర్శనం కోసం 3 నుండి 6 గంటల సమయం పడుతుంది. రూ. 300ల శీఘ్ర దర్శనం కోసం 2 నుండి 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లలో ఉన్న వారికి టీటీడీ పానీయాలు, ఆహార సౌకర్యాలను నిరంతరం అందిస్తోందని అధికారులు తెలిపారు.

Also read-TTD News: టీటీడీ గుడ్‌న్యూస్‌.. వారికి ప్రతిరోజూ 300 దర్శన టికెట్లు.. కండీషన్స్‌ అప్లై..!

స్వామి వారి హుండీ ఆదాయం: ఆదివారం రోజున తిరుమలలో భక్తుల రద్ది కాస్త ఎక్కువగానే నమోదైంది. మొత్తం 90,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని 42,747 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రికార్డు స్థాయిలో రూ. 3.85 కోట్ల ఆదాయం సమకూరింది. నిన్న మొత్తం 3.99 లక్షల లడ్డూలను విక్రయించిట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News