Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 6 గంటలకు పైగా సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

- Advertisement -

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని బుధవారం 65,887 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,725 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News