Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Dharmavaram: ధర్మవరంలో ఉగ్ర కలకలం… ఎన్ఐఏ అరెస్ట్, 16 సిమ్ కార్డుల స్వాధీనం

Dharmavaram: ధర్మవరంలో ఉగ్ర కలకలం… ఎన్ఐఏ అరెస్ట్, 16 సిమ్ కార్డుల స్వాధీనం

NIA Arrests Terror Suspect In Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు స్థానికంగా భయాందోళన సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. స్థానిక హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న నూర్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం గోప్యంగా అతన్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, నూర్ నివాసంలో సోదాలు నిర్వహించి 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

ALSO READ: Rajinikanth : రజనీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం – చంద్రబాబు, మోదీ శుభాకాంక్షలు

ఎన్ఐఏ అధికారులు నూర్ సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ చాట్‌లపై నిఘా వేశారు. అతను పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో ఫోన్ కాల్స్, చాట్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ సిమ్ కార్డుల ద్వారా అతను ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడనే విషయంపై లోతైన విచారణ జరుగుతోంది. గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఘటన ధర్మవరంలో ఆందోళన కలిగించింది. ఇటీవల విజయనగరం, రాయచోటిలోనూ ఉగ్ర కార్యకలాపాలపై ఎన్ఐఏ, ఇంటిలిజెన్స్ బ్యూరో చర్యలు తీసుకున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. నూర్‌ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్న అధికారులు, ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad