Tuesday, May 6, 2025
Homeఆంధ్రప్రదేశ్APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్-1 పరీక్షల అక్రమాల కేసులో ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని మధుపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని అతడి కార్యాలయంలో మధును అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు.

- Advertisement -

పరీక్షల నిర్వహణ ప్రక్రియ బాధ్యతలను క్యామ్‌సైన్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ధాత్రి మధు నేతృత్వంలోని ఈ సంస్థ మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించి కొందరు అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేలా మార్కులను తారుమారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇదే కేసుకు సంబంధించి విజయవాడలోని సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను ఏ1 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News