Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Dhone: డోన్ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆత్మీయ సమావేశం

Dhone: డోన్ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆత్మీయ సమావేశం

బుగ్గన ఓటమే లక్ష్యం

పట్టణంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు టిడిపి ఎం.పి అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అందరికీ తెలిసిందేనని, రెండున్నర సంవత్సరాల నుండి నాతో కలసి కష్టపడి పని చేసిన తెలుగుదేశంపార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. బుగ్గన ను ఓడించాలనే లక్ష్యంతో నెలలో 28 రోజులు తెలుగుదేశంపార్టీ కొరకు మనందరం కష్టపడిటం జరిగిందని అన్నారు.

- Advertisement -

నా ఎదుగుదలకు కోట్ల కుటుంబంతో పాటు కె.యి.ప్రతాప్, బీసి జనార్ధన్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి సహకరించారని, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని కలిసినప్పుడు కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వారికి న్యాయం చేయాలని తెలపడం జరిగిందని , కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కూడా న్యాయం చేస్తానని చెప్పారని అన్నారు. నేను డోన్, ప్యాపిలి, బేతంచేర్ల మూడు పట్టణాలలో పర్యటించినపుడు పేదలకు ఇంటి పట్టా ఇవ్వాలనుకున్నానని , కానీ ఇవ్వలేక పోతున్నందుకు బాధ పడుతున్నా అన్నారు. ఏది ఏమైనా గానీ రానున్న ఎన్నికల్లో బుగ్గన ను ఓడించి, ఎమ్మెల్యే గా మన అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డిని , ఎం.పీ గా మన పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి గారిని గెలిపించుకోని నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. ఎల్లవేళలా కార్యకర్తలకు మా కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథులు మన్నే సుబ్బారెడ్డి స్వగృహం కు , చాటకొండ శ్రీనివాసులు గారి స్వగృహం కు మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున, యువ నాయకులు మన్నే గౌతమ్ రెడ్డి, భరత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News