రాష్ట్రంలో మహిళల ఓట్లు అత్యధికంగా ఉన్నాయని మహిళల ఓట్లు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుందని అయితే 33% మహిళా రిజర్వేషన్ కోటా కింద డోన్ అసెంబ్లీని మహిళలకు కేటాయించాలని సుజాతా రెడ్డి డిమాండ్ చేశారు. డోన్ అసెంబ్లీ నుంచి అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పాలెం సుజాత రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడానికి అప్లికేషన్ నమోదు చేసుకున్న అభ్యర్థులను విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖాముఖిగా అప్లికేషన్ను పరిశీలించిన వైఎస్ షర్మిల రెడ్డి. డోన్ అసెంబ్లీ తరఫున అప్లికేషన్ వేసుకున్న పాలెం సుజాత రెడ్డి అప్లికేషన్ను కూడా పరిశీలించారు. బేతంచర్ల మండలం కోలుములపల్లె గ్రామం నుండి 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తూ, గ్రామాలలో నివసిస్తున్న ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించి, నిరుపేద కుటుంబాలకు తనదైన శైలిలో సహాయం చేస్తూ ఎన్నో కష్టాలను, వడుదుడుకులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పనిచేస్తూన తనకు అధిష్టానం డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.