Tuesday, December 9, 2025
Homeఆంధ్రప్రదేశ్Dhone: కోట్లకు వినతి పత్రం అందించిన యుటిఎఫ్ నాయకులు

Dhone: కోట్లకు వినతి పత్రం అందించిన యుటిఎఫ్ నాయకులు

జీవో 117రద్దు చేయాలి..

నియోజకవర్గం శాసనసభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి డోన్ , ప్యాపిలి మండలాల యూటీఎఫ్ నాయకులు రాష్ట్ర ఆడిట్ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నెంబర్ 117 రద్దుచేసి జీవో నెంబర్ 53 ప్రకారం టీచర్లను కేటాయించాలని, ప్రైమరీతో పాటు ఒకటి నుండి ఐదు తరగతులు ఒకే పాఠశాలగా నడపాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే సిలబస్ ఒకే పరీక్ష విధానం అమలు చేయాలని, హైస్కూల్లో రెండు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News