Thursday, December 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Srinivas Goud: తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష: శ్రీనివాస్ గౌడ్

తిరుమలలో(Tirumala) తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తిరుమల శ్రీవారు అందరికీ చెందిన వాడని గుర్తుచేశారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ.. శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకుంటారని చెప్పుకొచ్చారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని.. కానీ ఈ మధ్య కాలంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

సాధారణ ప్రజలతో పాటు, రాజకీయ, వ్యాపారవేత్తల విషయంలో వివక్ష కొనసాగుతుందన్నారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనన్నారు. తిరుమలలో తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News