Homeఆంధ్రప్రదేశ్Vaccination: నేటి నుంచి పశువులకు వ్యాధి నివారణ టీకాలు

Vaccination: నేటి నుంచి పశువులకు వ్యాధి నివారణ టీకాలు

Vaccination: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పశువులకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల నుంచి ముందస్తు రక్షణ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పశువులు, గొర్రెలు, మేకలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టీకాల పంపిణీ కార్యక్రమం నేటి (బుధవారం) నుంచే ప్రారంభం కానుందని, నిర్ణీత కాలవ్యవధిలో ఆయా వ్యాధుల నివారణకు ఉచితంగా టీకాలు వేస్తామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఉచిత టీకాల పంపిణీ షెడ్యూల్ వివరాలు:

  • ఆవులకు జబ్బ వాపు వ్యాధి నివారణ టీకాలు ఈ నెల 10 నుంచి 30వరకు అందించనున్నారు.
  • గేదెలు, ఆవులకు గొంతు వాపు వ్యాధి నివారణ టీకాలు ఈ నెల 25 నుంచి జులై 25 వరకు పంపిణీ చేయనున్నారు.
  • గొర్రెలు, మేకలకు చిటుక వ్యాధి నివారణ టీకాలు ఈ నెల 15 నుంచి జులై 15వరకు అందిస్తారు.
  • గొర్రెలు, మేకలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు జులై 1 నుంచి 30 వరకు పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు.

పశుపోషకులకు విజ్ఞప్తి: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల వల్ల పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. నిర్దేశిత తేదీల్లో మీ సమీపంలోని ప్రభుత్వ పశువైద్యశాలలను సంప్రదించి జీవాలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News