Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్DL Ravindra Reddy: చంద్రబాబే ఏపీకి దిక్కు.. సీఎం జ‌గ‌న్‌పై డీఎల్ ర‌వీంద‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

DL Ravindra Reddy: చంద్రబాబే ఏపీకి దిక్కు.. సీఎం జ‌గ‌న్‌పై డీఎల్ ర‌వీంద‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

DL Ravindra Reddy: ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై మాజీమంత్రి డియల్ రవీంద్రారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ దివాలా తీయించార‌ని విమ‌ర్శించారు. త‌న స్నేహితుడి కొడుకు రాష్ట్రానికి గొప్ప పాల‌న అందిస్తాడ‌ని అనుకున్నాన‌ని, కానీ అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి అవినీతి మ‌య‌మైన పాల‌న అందిస్తున్నార‌ని ఆరోపించారు. బైజూస్ కంటెంట్ మిగ‌తా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దివాలా అంచున ఉన్న ఏపీలో బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంద‌ని విమ‌ర్శించారు. బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృధా చేస్తుంద‌న్న డీఎల్‌.. బైజూస్ తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లా కు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని ఆరోపించారు. బైజూస్ కోసం ఖర్చుచేస్తున్న 1400కోట్లలో కనీసం కొంతైన ఉపాధ్యాయులకు ఖర్చు చేయాలని డీఎల్ సూచించారు. విద్యార్థులు విషయంలో ప్రభుత్వం అవినీతి మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

నేను ఇంకా వైకాపాలో కొనసాగుతున్నాన‌న్న డీఎల్‌.. న‌న్ను పార్టీ నుండి తొలగించ‌లేద‌న్నారు. అవినీతి కి తావులేకుండా పరిపాలన చేస్తా అని జగన్ చెప్పాడ‌ని, నా స్నేహితుడు కుమారుడు జగన్ ఇంత అవినీతిపరుడుగా మారుతాడని ఊహించలేదని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ తాగి మా మండలంలో ఆరుగురు చనిపోయారని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తు పెట్టుకొనే అవ‌కాశం ఉంద‌న్న డీఎల్‌.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితేనే ఏపీ బాగుప‌డుతుంద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిజాయితీ క‌లిగిన వ్య‌క్తి, కానీ ప‌రిపాల‌నా శ‌క్తి ప‌వ‌న్ కు లేద‌ని అన్నారు. సీఎం జ‌గ‌న్ తీరుతో, వైసీపీలోని ప‌లువురు నేత‌ల తీరుతో వైసీపీలో ఉన్నానంటే చాలా అస‌హ్యంగా ఉంద‌ని డీఎల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హ‌త్య‌కేసు విష‌యంపై మాట్లాడుతూ.. ఈ కేసులో జ‌న‌వ‌రి 3వ తేదీ త‌ర్వాత ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతుంద‌ని డీఎల్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News