DMHO Suhasini: విజయవాడలోని న్యూ రాజేశ్వరిపేటలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు డీఎంహెచ్‌వో సుహాసిని తెలిపారు. డయేరియాతో ఇద్దరు చనిపోయారన బాధితులు ఆందోళన చెందడంతో.. 10 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని సుహాసిని అన్నారు. వాటర్ టెస్ట్‌లో ఎలాంటి సమస్య లేదంటూ రిపోర్ట్ వచ్చిందని ఆమె వెల్లడించారు. అవి సాధారణ మరణాలేనని సుహాసిని పేర్కొన్నారు.
అన్నదానంలో ఫుడ్ పాయిజన్!: స్థానికులు ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. ఇప్పటివరకు ఎలాంటి డయేరియా మరణాలు లేవని డీఎంహెచ్ అధికారిణి తెలిపారు. వినాయకుడి అన్నదానంలోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలను ఇంకా సేకరిస్తున్నట్లు డీఎంహెచ్‌వో సుహాసిని తెలిపారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సైతం స్పందించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫుడ్‌పాయిజన్ బాధితుల కోసం కలెక్టర్ కార్యాలయంలో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


