Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న నంద్యాల తొలి మహిళ

Nandyala: పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న నంద్యాల తొలి మహిళ

చరిత్ర సృష్టించిన బైరెడ్డి శబరి

భారత రాజ్యాంగంలోనే కీలక పదవులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులకు పంపి దేశంలోనే ఏకైక లోక్ సభ నియోజకవర్గంగా నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు. నంద్యాల నుంచి తొలిమహిళా ఎంపిగా లోక్ సభలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించబోతున్న డాక్టర్ బైరెడ్డి శబరి. 1

- Advertisement -

952 వ సంవత్సరంలో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం ఏర్పడింది, తదనంతరం కూడా నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో అనేక మార్పులు జరిగాయి. స్వాతంత్రం అనంతరం 1952 లో జరిగిన ఎన్నికల్లో మొదటి పార్లమెంట్ సభ్యులుగా స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరిరావు కాంగ్రెస్ అభ్యర్థి సూడా రామిరెడ్డిపై విజయం సాధించారు. అనంతరం పలు కారణాల వల్ల నంద్యాల లోక్ సభ నియోజకవర్గం రధ్ధయ్యింది.
నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలోని ప్రాంతాలను కర్నూలు, మార్కాపురం నియోజకవర్గాలలో విలీనం చేశారు. దీంతో జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, మార్కాపురం లోక్ సభ నియోజకవర్గాలుగా ఏర్పాటు అయ్యాయి. 1957 లో ఎన్నికలు జరిగాయి. ఆదోని నుంచి పెండెకంటి వెంకట సుబ్బయ్య, కర్నూలు నుంచి ఉస్మాన్ అలీఖాన్, మార్కాపురం నుంచి సి. బాలిరెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించారు. మళ్ళీ 1962 లో జరిగిన ఎన్నికల్లో కర్నూలు నుంచి యశోదారెడ్డి, ఆదోని నుంచి పెండెకంటి వెంకట సుబ్బయ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కాగా మార్కాపురం నుండి జి. ఎల్లమంధారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967 వ సంవత్సరం ఎన్నికలు జరిగే నాటికీ తిరిగి నంద్యాల ప్రత్యేక పార్లమెంట్ నియోజకవర్గంగా అవతరించింది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News