Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Dragons C/o Chagalamarri: దేశీ డ్రాగన్ ఫ్రూట్ C/o చాగలమర్రి

Dragons C/o Chagalamarri: దేశీ డ్రాగన్ ఫ్రూట్ C/o చాగలమర్రి

లాభదాయకమైన వాణిజ్య పంటగా మారిన డ్రాగన్ పళ్ల తోటలు

విఆర్ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మన చాగలమర్రిలో పండుతోంది
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో నారాయణ పల్లె వెళ్ళే రహదారిలో సరి కొత్తగా విఆర్ డ్రాగన్ ఫ్రూట్ పంట ప్లాంటేషన్ ని ప్రారంభించారు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రామిశెట్టి వీరభద్రుడు, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి.

- Advertisement -

మంచి డిమాండ్ ఉన్న పండు

డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు అధికంగా ఉండటంతో ఇది మంచి వాణిజ్య పంటగా మారింది. దీంతో వీటిని పండించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌ టేస్ట్‌, దీనిలోని పోషక విలువల కారణంగా చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడుతుంటారు. డ్రాగన్‌ ఫూట్‌ పోషకాలు స్టోర్‌ హౌస్‌ అని చెప్పాలి. ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి3 విటమిన్లూ ఉంటాయి. తరచూ మన డైట్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రూట్ ప్లాంటేషన్ సాగు చేస్తున్న ప్రొప్రైటర్ ఉల్లి రమేష్ మాట్లాడుతూ దాదాపుగా 5 ఎకరాలలో ఈ పంట వేశారు.

సాంప్రదాయ పంటలను వేస్తూపోతే ఆదాయం లేదు కనుక కొత్తదనం కోరుకునే తాము.. 2022 డిసెంబర్ లో ఈ పంటను ప్లాంటేషన్ చేసినట్టు చెబుతున్నారు. దాదాపుగా 7 నెలలకే పంట రావడం డ్రాగన్ ఫ్రూట్ పండు ప్రత్యేకత. ఈ వైరైటీని ఎక్కడి నుంచి దిగుమతి చేశారు అంటే గుజరాత్, కర్ణాటకలోని బుడేన్ గిరి, హోస్పెట్ నుంచి ఈ కొత్త వెరైటీని దిగుమతి చేసి చాగలమర్రి గ్రామంలో ప్లాంటేషన్ చేసినట్టు తెలిపారు. దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా , తెలంగాణ , చెన్నై , కర్ణాటక ఇలా ఏ రాస్ట్రానికైన ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని ఉల్లి ప్రసాద్ అన్నారు. ఇంకో 20 రోజుల తరువాత 2-3 టన్నుల దిగుమతులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామిశెట్టీ వీరభద్రుడు , మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, మండల ఉప మండల అధ్యక్షుడు ముల్లా.రఫీ , తోడెండ్ల పల్లె సర్పంచ్ రామిశెట్టి గోవింద్ , రామిశెట్టీ శ్రీనివాసులు , పార్టీ అభిమానులు , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


డ్రాగన్ ఫ్రూట్ గురుంచి పూర్తి సమాచారం :
డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏమిటి ? వాటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఎంటి ? వాటి గురించి ముందుగా మనం తెలుసుకోవాలి కాబట్టి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు మరియు దాని రకాలు గురించి సమాచారం.

డ్రాగన్ ఫ్రూట్ అలంకారమైన క్లైంబింగ్ వైన్స్ కాక్టస్ జాతుల నుండి వస్తుంది. ఈ పండు రుచి సున్నితంగా తీపిగా ఉంటుంది కానీ క్రంచీగా ఉంటుంది. దాని ఆకుపచ్చ పొలుసులు, గులాబీ రంగు చర్మంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. డ్రాగన్ స్కేలీ మాదిరిగానే దాని పొలుసుల రూపాన్ని కలిగి ఉన్నందున ఈ పండుకు డ్రాగన్ ఫ్రూట్ అని పేరు పెట్టారు. ఈ పండు పరిమాణం 6-12 సెం.మీ, దాని ఆకారం ఓవల్. ఇది తెల్లటి గుజ్జును కలిగి ఉంటుంది, ఇది నల్లటి, తినదగిన విత్తనాలతో నిండి ఉంటుంది.

తక్కువ వర్షం ఉన్నా పండుతుంది కాబట్టి..తక్కువ వర్షం ఉన్నా పండుతుంది కాబట్టి..

ప్రాథమికంగా, ఇది ప్రధానంగా థాయిలాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, శ్రీలంకలో ప్రసిద్ధి చెందింది. ఈమధ్యకాలంలో మనదేశంలో ఈ పళ్లు పండించే రైతుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర రూ. 150-250 వరకు ఉంది. తక్కువ వర్షపాతంతో కూడా ఈ పంట పండించవచ్చు. దీంతో తాజా పండు లేదా జామ్‌లు, పండ్ల రసం, ఐస్ క్రీమ్‌లు, జెల్లీ, వైన్, ఫేస్ ప్యాక్‌ల ఉత్పత్తులకు దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయానికి సరైనవి.

  1. పోషకాలు అధికంగా ఉంటాయి
    డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలు ఉన్నాయి, ఇది ఫిట్‌గా-ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, పోషకాలు:
  2. కేలరీలు: 136
  3. ప్రోటీన్: 3 గ్రాములు
  4. ఫైబర్: 7 గ్రాములు
  5. ఇనుము: RDIలో 8%
  6. కొవ్వు: 0 గ్రాములు
  7. కార్బోహైడ్రేట్లు: 29 గ్రాములు
  8. విటమిన్ E: RDIలో 4%
  9. మెగ్నీషియం: RDIలో 18%
  10. విటమిన్ సి: RDIలో 9%

డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రాముఖ్యత
డ్రాగన్ ఫ్రూట్ ప్రాముఖ్యత

కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది
బరువు నిర్వహణలో సహాయపడుతుంది
కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి
యాంటీఆక్సిడెంట్ల మంచి మూలం
ఆర్థరైటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది
విటమిన్లు & మినరల్స్ అధికంగా ఉంటాయి
వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది
ఆస్తమాను నివారించడంలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News