Bus driver suffer hear attack: ఏపీలోని కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తాను మరణిస్తున్నానని తెలిసి కూడా.. 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాలేజీ బస్సు డ్రైవర్ కాపాడారు. నిత్యం సరదాగా ఉండే డ్రైవర్ వారి కళ్ల ఎదుటే చనిపోవడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు.
బస్సును ఆపి కుప్పకూలిన డ్రైవర్: నా ప్రాణాలు ఉంటే చాలు అనుకునే రోజుల్లో నా ప్రాణానికి ఏమైనా పర్లేదు.. నన్ను నమ్మిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదని ఓ డ్రైవర్ అనుకున్నాడు. తన ప్రాణాలు పోతున్నా చాకచక్యాన్ని ప్రదర్శించారు. 50 మంది ప్రాణాలను కాపాడారు. గుండె పోటు రావడంతో బస్సు పక్కనే ఆపి కుప్పకూలిపోయాడు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మడికి గ్రామానికి చెందిన 60 ఏళ్ల దెందుకూరి నారాయణరాజు రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం విద్యార్థులను కళాశాలకు బస్సులో తరలిస్తుండగా నారాయణరాజు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తనకు గుండెపోటు వస్తుందనే అంశాన్ని గమనించాడు. దీంతో వెంటనే బస్సును జాతీయ రహదారి పక్కన ఆపేశాడు. అనంతరం రోడ్డు పక్కన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Also Read:https://teluguprabha.net/crime-news/husband-beats-wife-to-death-with-cricket-bat-in-ameenpur/
విద్యార్థులు కంటతడి: డ్రైవర్ నారాయణరాజు గుండే పోటుకు గురైయ్యారని గుర్తించిన ఇంజనీరింగ్ విద్యార్థులు వెంటనే అప్రమత్తం అయ్యారు. సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు స్పందించి ఘటనా స్థలికి చేరుకున్నారు. డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలను కోల్పోయాడు. డ్రైవర్ నారాయణరాజు తను చనిపోతూ 50 మంది ప్రాణాలను కాపాడారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విద్యార్థులతో సరదాగా ఉండే నారాయణరాజు వారి కళ్ల ఎదుటే చనిపోవడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు.


