Wednesday, December 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Droupadi Murmu: గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

Droupadi Murmu: గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

Droupadi Murmu: ఏపీ పర్యనటలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్(Abdul Nazeer), సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఆమెకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు గౌరవవందనం స్వీకరించిన రాష్ట్రపతి రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు బయలుదేరి వెళ్లారు.

- Advertisement -

కాగా AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంబీబీఎస్‌ తొలి బ్యాచ్‌ విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లనున్నారు. శీతాకాలం విడిదిలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News