పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. ఇది డిసెంబర్ 24 నాటికి పశ్చిమ-నైరుతి దిశగా కదిలి ఉత్తర తమిళనాడు & దక్షిణకోస్తా తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది.
డిసెంబర్ 23, సోమవారం :
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 24, మంగళవారం
ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
~రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.