Dussehra School Holidays In AP and Telangana: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు అమల్లో ఉంటాయని ప్రకటించింది. దేవీ నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయని స్పష్టం చేసింది. దీంతో, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల షెడ్యూల్‌ను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అధికారికంగా మొత్తం 13 రోజులు పండగ సెలవులిచ్చారు. 4న స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందుకే, ఈ పండుగకు ఏపీతో పోలిస్తే తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ రోజులు సెలవు ప్రకటించనట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-plans-to-construct-temples-in-ap/
తెలంగాణలో 13 రోజుల పాటు సెలవులు..
కాగా, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపి, పండుగను ఆహ్లాదకరంగా జరుపుకునే అవకాశం లభిస్తుంది. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన అనేకమంది సైతం స్వగ్రామాలకి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు దసరా అతిపెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఎక్కువ మంది జరుపుకునే పండుగ దసరా. ఇక, తెలంగాణలో అయితే దసరా ప్రధానమైన పండుగ. అందుకే విద్యార్ధులతో పాటు ఉద్యోగులు కూడా ఈ సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా దసరాకు తమ సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే వారు, టూర్ ప్లాన్ చేసుకునే వారికి మరో రెండ్రోజులు కలిసి రానుంది. ఇక ఏపీ అమ్మవారి ఆలయాల్లో ఈ దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు సైతం అదే దసరా సెలవుల్లో ఘనంగా జరుగుతాయి.


