Duvvada Srinivas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అరెస్టుపై వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం కనుసైగలతోనే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందని ఆరోపించారు. బన్నీ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తొందర పడ్డారని.. కళాకారులను ఇబ్బందులు పెట్టే వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం అన్నారు.
ఇక తనను అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. తనకు 41ఏ నోటీసుల జారీ చేసిన పోలీసులను కోర్టుకు ఈడుస్తానని తెలిపారు. పోలీసులు విచారణకు ఎక్కడికి, ఏ తేదీన రావాలో చెప్పలేదన్నారు. తాను ఇంట్లోనే ఉంటానని.. ఎవరొచ్చి అరెస్టు చేస్తారో చూస్తానంటూ సవాల్ చేశారు. కేసులు తనకేమి కొత్త కాదని 18 కేసుల్లో ఏ1గా ఉన్నానని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడుతూ ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ మండిపడ్డారు.