Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Dwakra group: డ్వాక్రా మహిళలకు శుభవార్త

Dwakra group: డ్వాక్రా మహిళలకు శుభవార్త

డ్వాక్రా మహిళలకు (dwakra group Womens) కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. పొదుపు సంఘాల మహిళల పిల్లల చదువులు, వివాహ అవసరాలకు 5 శాతం వడ్డీతోనే రూ. లక్ష వరకు రుణాన్ని అందించనుంది. చాలామంది పేదలు వారి బిడ్డల చదువులు, వివాహాలకు బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి అవస్థలు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు ప్రారంభించగా, సీఎంవో(CMO) ఆమోదం తెలిపింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున లేదా మరో తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం

- Advertisement -

స్త్రీనిధి ద్వారా అమలు
ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలున్నారు. వీరంతా లబ్ధిపొందనున్నారు. ఈ పథకానికి ఏటా రూ.1,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అంటే రానున్న 4 ఏళ్లలో రూ.4 వేల కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రుపొందించారు. నిధుల సమీకరణపై అధికారులు కసరత్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News