Tuesday, January 7, 2025
Homeఆంధ్రప్రదేశ్Earthquake: ఏపీలో మరోసారి భూప్రకంపనలు

Earthquake: ఏపీలో మరోసారి భూప్రకంపనలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు(Earthquake) వచ్చాయి. ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. మధ్యాహ్నం 1:43 గంటలకు భూమి కంపించినట్లు సమాచారం. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూ ప్రకంపనలు సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతోందనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కాగా గత డిసెంబర్ నెలలోనూ ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. దీంతో ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు, ఇళ్ల నుంచి ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.

ఇక తాళ్లూరు మండలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. తాజాగా మరోసారి కూడా భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వరుసగా భూప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో కనిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News