Gannavaram Airport: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు: మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. విమానాశ్రయంలో దిగే ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వారిని వెంటనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.
Also read-Ebola effect: ఎయిర్‌పోర్టుల్లో అలర్ట్.. ఆగిన ఆఫ్రికా సదస్సు!

