Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Directorate of Enforcement: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసు.. దూకుడు పెంచిన...

Directorate of Enforcement: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసు.. దూకుడు పెంచిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం పై ఈడీ దృష్టి సారించింది. ఈ స్కాం లో విచారణపై ఈడీ దూకుడు పెంచింది. రూ. 234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. పలు షెల్ కంపెనీల సాయంతో నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం అంటే.. డిసెంబర్ 5న హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

- Advertisement -

టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం విడుదల చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయని జగన్ సర్కార్ ఆరోపించింది. ఈ విచారణను సీఐడీకి అప్పజెప్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కాంలో మనీ లాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సమాచారమిచ్చింది. తాజాగా ఈడీ ఆయా కంపెనీలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News