ఏపీలో ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections)జరగనున్న సంగతి తెలిసిందే. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ స్థానాలకు… విజయనగరం-శ్రీకాకుళం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదలచేసింది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి(Amaravati) పనులకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘాని(Election Commission)కి సీఆర్డీఏ లేఖ రాసింది.
కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియామవళి సడలించాలని సీఈసీని కోరింది. త్వరలోనే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయని.. పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ లేఖపై సీఈసీ స్పందిస్తూ అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు, పనులు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ సీఆర్టీఏ లేఖకు రిప్లై ఇచ్చింది.