Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి: స్పీకర్ అయ్యన్న

AP Assembly: అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి: స్పీకర్ అయ్యన్న

AP Assembly| ఏపీ అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగిసినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Pathrudu) తెలిపారు. పీఏసీ కమిటీ సభ్యులుగా నక్కా ఆనంద్ బాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వర్ రావు, కోళ్ల లలితకుమారి, శ్రీరాం రాజగోపాల్, పులపర్తి ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు ఎన్నిక అయినట్లు చెప్పారు.

- Advertisement -

అలాగే అంచనాల కమిటీ సభ్యులుగా భూమ అఖిలప్రియ, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరావు, కందుల నారాయణ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, కొలుసు పార్థసారథి, సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు ఎన్నిక అయినట్లు పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వ రంగ సంస్థల సమితి సభ్యులుగా బత్తుల ఆనంద్ బాబు, ఈశ్వర్ రావు, సత్యానారాయణ, గౌత్ శీరిష, కూన రవికుమార్, వర్ల కుమార్ రాజు, సజయకృష్ణ రంగారావు, తెనాలి శ్రవణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్‌లు సభ్యులుగా ఎన్నికైనట్లుగా స్పీకర్ వెల్లడించారు. మరోవైపు కీలకమైన పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News