Electricity charges| ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. దీంతో రేపటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ ఛార్జీల పెంపు ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి యూనిట్‌కు 92 పైసల చొప్పున 2026 నవంబర్ వరకు వసూలు చేస్తారు. ఈ పెంపు కారణంగా నెలకు 200 యూనిట్ల కరెంటు వాడేవారికి బిల్లు అదనంగా రూ.184 పెరగనుంది. వ్యవసాయ విద్యుత్ రాయితీకి గాను రూ.9,412 కోట్లలో రూ.1,500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా.. దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది.
కాగా గత వైసీపీ ప్రభుత్వం 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీల పెంపునకు మొగ్గు చూపుతోంది. దీంతో సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్ష వైసీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరససి్తూ వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చింని కూటమి నేతలు వాదిస్తున్నారు.