Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వాల్మీకుల వెనుకబాటు పాలకులకు వరం

Emmiganuru: వాల్మీకుల వెనుకబాటు పాలకులకు వరం

కల్లుకుంట లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట

ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులు కొన్ని జిల్లాలలో ఎస్టీలుగా ఇంకొన్ని జిల్లాలో బీసీ ఏగా ఉన్నారని దీంతో అత్యధికంగా రాయలసీమలో ఉన్న వాల్మీకులు అన్యాయానికి గురవుతున్నారని రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రాలయం వాల్మీకి లక్ష్మన్న అవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

బాబు-పవన్-పురంధేశ్వరికే సాధ్యం..

మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ గ్రామ వాల్మీకులు మధ్య వైభంగా జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకి లక్ష్మన్న మాట్లాడుతూ వాల్మీకి ఎస్టీ సాధన కోసం 40 ఏళ్ల క్రితం స్థాపించిన వాల్మీకి ఐక్య పోరాట కమిటీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఏపీలో 50 లక్షల మంది ఉన్నాం. మాకు కుల వృత్తి లేదని నిరక్షరాస్యత,పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పాలక, ప్రతిపక్ష పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. ఎస్టీలుగా గుర్తించాలని మేము చేసే పోరాటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం బిల్లు పెండింగ్ లో ఉంది. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి దృష్టి సారిస్తే మా బతుకులు బాగు పడుతాయి. వాల్మీకుల ఎస్టీలుగా గుర్తించేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకే సాధ్యమని వారన్నారు. త్వరలో పవన్, నాగబాబులను వాల్మీకి దీన స్థితి గతులు వివరిస్తామన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఐక్య పోరాట కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గాపురం చిన్న ఈరన్న, తాయన్న, నరసింహులు, బిపి తిక్కయ్య, సంజీవయ్య, నడిపి తిక్కన్న, బుడ్డన్న, లింగన్న, కేశవతో పాటు గ్రామ వాల్మీకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News