Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: బాబు విడుదలయ్యే వరకూ పోరాటం

Emmiganuru: బాబు విడుదలయ్యే వరకూ పోరాటం

చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని, వైసిపి అరాచక పాలనను గద్దె దింపడానికి ప్రజలు ముందుకు రావాలని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో టిడిపి అధ్వర్యంలో 14 రోజు జరిగిన నిరాహార దీక్షలను బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. అనంతరం బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్న వైసిపిను ఇంటికి పంపే వరకు పోరాటాలు చేస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమంను మరిచి ప్రతిపక్షాలపై కేసులతో భయపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, మిఠాయి నరసింహులు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, మునీర్, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, బంద నవాజ్, శాబీర్, పార్ల పల్లి మల్లికార్జున, బోయ రంగన్న, నజీర్, అల్తాఫ్, మురళి రెడ్డి, కొండన్న గౌడ్, శంకర్ గౌడ్, డీలర్ ఈరన్న, దాదా వలి, నాగేష్ ఆచారి, శిల్పి భాస్కర్, సలీం, సలాం, గౌస్, ఈశ్వర్, యు రవి, కృష్ణతేజ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News