Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

Emmiganuru: ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టిన రోజు వేడుకలను ఎమ్మిగనూరు లో ఘనంగా నిర్వహించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు కదిరికోట అదేన్న అధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న చంద్రబాబు అయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకున్నారు.

- Advertisement -

కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, రామదాసు గౌడ్, దయాసాగర్, నేసే మల్లికార్జున, రంగస్వామి గౌడ్, కలిముల్లా, మధుబాబు, నజీర్ అహ్మద్, కటారి రాజేంద్ర, చిన్న రాముడు, మాదవ్ రావు దేశాయ్, ఈరన్న గౌడ్, గడ్డం నారాయణ రెడ్డి, కాశీం వలి, దర్మపురం గోపాల్, టి రమేష్ నాయుడు, ఎన్వీ రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News