అనంతపురం జిల్లాలో ఓ లారీ డ్రైవర్ కు వైసిపి తరుపున ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అతనని అవమానించడం చంద్రబాబు నాయుడు తగదని ఎమ్మిగనూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖయ్యాం అన్నారు. స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎవారికైనా డ్రైవర్స్ ఉండాల్సిందే. అలాంటి డ్రైవర్స్ పట్ల వివక్షత చూపిన చంద్ర బాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అనేక యేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇలా మాట్లాడం చాలా బాధాకరం. మీ హయాంలో చదువుకున్నా విద్య వంతులకు ఉద్యోగాలు ఇచ్చుంటే నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వారు కాదు. టిప్పర్ డ్రైవర్ విద్యావంతుడు కాబట్టి వైసిపి సీటు ఇచ్చింది. డ్రైవర్స్ కు సీటు ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వండి. లేకపోతే అవమానించడం మానుకోవాలి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్ర బాబు ఇలా మాట్లాడటం సరైన విధానం కాదని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు.