వచ్చే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి డస్ట్ బీన్ లో పడేయాలని టిడిపి జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అధ్వర్యంలో స్థానిక తేరు బజారులో ప్రజా గళం బహిరంగ సభ లో చంద్ర బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం టిడిపి ద్వారా సాద్యం. జగన్ నన్ను ఏమి చదువావో చెప్పాలని అడుగుతున్నాడు. నేను తిరుపతి యునివర్సిటీలో ఎంఏ చదివాను. జగన్ ఏమి చదువాడో సమాధానం చెప్పాలన్నారు.
నోరు అదుపులో పెట్టుకోక పోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. వాళ్ళ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిగా పని చేశానన్నారు. జగన్ ఓ బచ్చాగాడని..అంటూ బాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా లో 1 ఎస్సి, 1 ఆర్యవైశ్య ,4 బిసి ,1 రెడ్డి వర్గాలను టిడిపి అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. ఎంపీ అభ్యర్థిగా కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజుకు ఇచ్చామన్నారు. ఎవరి పార్టీలో సామాజిక న్యాయం ఉందో ప్రజలు గ్రహించాలి. టిడిపి డిఎన్ఏ లో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి కుటుంబం ఉంది.వీరి కుటుంబానికి మాకు విడదీయలేని అనుబందం ఉంది. ఎమ్మిగనూరు అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి, మంత్రాలయం అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు అభ్యర్థి వీరభద్ర గౌడ్,పత్తికొండ అభ్యర్థి కేఈ శ్యాం బాబు, కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి , కర్నూలు అభ్యర్థి టిజీ భారత్ ,ఆదోని (బిజేపి) ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజులను గెలిపించాలని కోరారు.
ఎదురు వచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్ళాలని సూచించారు. సైకిల్ స్వీడ్ కు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం. రాంపురం రెడ్డి సోదరులు వై బాలనాగి రెడ్డి( మంత్రాలయం), వై సాయి ప్రసాద్ రెడ్డి (ఆదోని), వై వెంకటరామి రెడ్డి( గుంతకల్) ,ఉరువకొండ శివరాం రెడ్డి లు వారి అబ్భ సోత్తు మాదిరిగా భావించి దోచుకుంటున్నారు. వాళ్ళ నాన్న టిడిపి లోనే ఉండే వాడు. వాళ్ళ ఆగడాలను చూస్తూ ఊరుకోమని అన్నారు. వైసిపి అభ్యర్థులు బుట్టా రేణుక, బాల నాగి రెడ్డి,సాయి ప్రసాద్ రెడ్డి, బీ వై రామయ్య పేదలు అంటూ జగన్ చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. బుట్టా రేణుక 250 కోట్లు ఉన్నట్లు గతంలో ఏన్నికల అఫడవిట్ లో పేర్కొంది. రాంపురం రెడ్డి సోదరులపై ముగ్గురి పై బీసీల నిలబెట్టాము. బిసిలు టిడిపి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక్క తుంగభద్ర ప్రాజెక్టు నీరు తప్ప ఇతర ప్రాజెక్ట్ లు లేవు. గుడికల్ చెరువు కు కేటాయించిన స్థలంలో ను తిరిగి స్వాధీనం చేసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తాం. గోదావరి ,కృష్ణ నది నుండి కర్నూలు జిల్లాకు నీరు మళ్లించి త్రాగు సాగు అందిస్తాం.
వాల్మికులను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. అంతకుముందు టిడిపి మైనారిటీ నాయకుడు నజీర్ అహ్మద్, కలిముల్లా ,చేనేత విభాగం నాయకులు మహేష్ అధ్వర్యంలో చంద్ర బాబు కు వారి వారి సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. ఎమ్మిగనూరు కు చెందిన కు రువ మద్దిలేటి చంద్రబాబు సంస్ఖంలో టిడిపిలో చేరారు. చంద్ర బు టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. చంద్రబాబు ప్రచార వాహనం పై టిడిపి జిల్లా అధ్యక్షుడు బీ టి నాయుడు, ఎమ్మిగనురు,మంత్రాలయం అభ్యర్థులు బీవీ జయానాగేస్వర రెడ్డి , ఎన్ రాఘవేంద్ర రెడ్డి,కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు , స్థానిక టిడిపి నాయకుడు డాక్టర్ సోమనాథ్ ఉన్నారు.